TG-5193
Telugu

నా దేవుని కృపవలన సమస్తము సమకూడి జరుగును

Naa Deevuni Krupavalana Samasthamu Samakoodi Jarugunu

20
views
పల్లవి

నా దేవుని కృపవలన సమస్తము సమకూడి జరుగును (2) నాకు లేమి లేనే లేదు అపాయమేమియు రానే రాదు (2) ||నా దేవుని||

1వ చరణం

కరువులో కష్టాలలో ఆయనే నన్ను బలపరుచును (2) ఆయనే నన్ను బలపరుచును ఆయనే నన్ను ఘనపరుచును (2) ||నా దేవుని||

2వ చరణం

శ్రమలలో శోధనలో ఆయనే నాకు ఆశ్రయము (2) ఆయనే నాకు ఆశ్రయము ఆయనే నాకు అతిశయము (2) ||నా దేవుని||

3వ చరణం

ఇరుకులో ఇబ్బందిలో ఆయనే నన్ను విడిపించును (2) ఆయనే నన్ను విడిపించును ఆయనే నన్ను నడిపించును (2) ||నా దేవుని||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.