TG-3996
Telugu

నిన్ను చూడగ వచ్చినాడురా

Ninnu Choodaga Vachchinaaduraa

21
views
పల్లవి

నిన్ను చూడగ వచ్చినాడురా దేవ దేవుడు గొప్ప రక్షణ తెచ్చినాడురా యేసు నాథుడు (2) లోకమే సంతోషించగా ప్రేమనే పంచే క్రీస్తుగా బెత్లెహేమను ఊరిలో కన్యకు పుట్టినాడురా పొత్తి గుడ్డల మధ్యలో హాయిగా నిద్దరోయెరా ||నిన్ను||

1వ చరణం

దేవుని కోపము నుండి తప్పించే ప్రియ పుత్రుడాయనే (2) ముట్టుకో ముద్దు పెట్టుకో (2) ||బెత్లెహేమను||

2వ చరణం

గుండెలో కొలువైయుండి దీవించే ధనవంతుడాయనే (2) ఎత్తుకో బాగా హత్తుకో (2) ||బెత్లెహేమను||

3వ చరణం

తోడుగ వెంటే ఉండి రక్షించే బలవంతుడాయనే (2) చేరుకో నేడే కోరుకో (2) ||బెత్లెహేమను||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.