TG-3999
Telugu

నిన్ను తలచి

Ninnu Thalachi

20
views
పల్లవి

నిన్ను తలచి నను నేను మరచి నీ సాక్షిగా ఇల నే బ్రతుకుచుంటిని (2) యేసయ్యా.. నీ కృప లేక నే బ్రతుకలేను (2) ||నిను తలచి||

1వ చరణం

జీవము లేని దైవారాధనలో నిర్జీవ క్రియలతో మృతుడనైతిని (2) జీవాధిపతివై నా జీవితానికి నిత్య జీవము నొసగిన యేసయ్యా (2) ||నిను తలచి||

2వ చరణం

దారే తెలియని కారు చీకటిలో బ్రతుకే భారమై నలిగిపోతిని (2) నీతి సూర్యుడా ఎదలో ఉదయించి బ్రతుకే వెలుగుతో నింపిన యేసయ్యా (2) ||నిను తలచి||

3వ చరణం

సద్గుణ శీలుడా సుగుణాలు చూచి హృదిలో నేను మురిసిపోతిని (2) సుగుణాలు చూచుటకే నీవు సిలువలో నాకై నలిగిన యేసయ్యా (2) ||నిను తలచి||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.