♪♫
TG-3998
Telugu
నిన్ను కాపాడువాడు
Ninnu Kaapaaduvaadu
19
views
పల్లవి
నిన్ను కాపాడువాడు కునుకడు నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు (2) నీ భారము వహియించు యేసు నీ కొరకై మరణించె చూడు (2) ||నిన్ను కాపాడు||
1వ చరణం
పలుకరించే వారు లేక పరితపిస్తున్నా కనికరించి వారు లేక కుమిలిపోతున్నా (2) కలతలెన్నో కీడులెన్నో బ్రతుకు ఆశను అణచివేసినా (2) ఎడబాయడు యేసు నిన్ను దరి చేర్చును యేసు నిన్ను (2) ||నిన్ను కాపాడు||
2వ చరణం
మనస్సులోన శాంతి కరువై మదనపడుతున్నా పరుల మాటలు కృంగదీసి బాధపెడుతున్నా (2) భీతులెన్నో భ్రాoతులెన్నో సంతసంబును త్రుంచివేసినా (2) ఎడబాయడు యేసు నిన్ను దరి చేర్చును యేసు నిన్ను (2) ||నిన్ను కాపాడు||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.