యేసునాధుని సేవ యిపుడు మాకబ్బెను
yeesunaadhuni seeva yipudu maakabbenu
యేసునాధుని సేవ యిపుడు మాకబ్బెను వెఱవము వెఱవము యేసు దాసులతో బొత్తు భక్తి మా కమరెను జడియము జడియము ||యేసునాధుని సేవ||
లోక జ్ఞానములోని లోతుఁ దెలిసి మేము లొంగము లొంగము యేసు రాకడకొఱకు సంత సించి యెల్లప్పు డుండెద ముండెదము ||యేసునాధుని సేవ||
దైవజనుల మని ధైర్యముతో మేము పల్కెదము పల్కెదము పాప భారమంతయు యేసు ప్రభున కప్పగించి బ్రతుకుచు బ్రతుకుచు ||యేసునాధుని సేవ||
శుభవర్తమానము సొంపుగా నరులకుఁ జెప్పెదము జెప్పెదము లోక వైభవములను వాంఛించక యేసుని పలికెదము పలికెదము ||యేసునాధుని సేవ||
నీతికవచంబును నెనరుతో ధరియించి నిలిచెదము నిలిచెదము లోక ఘాతకుఁడైన పి శాచిని యెదిరించి కట్టెదము కట్టెదము ||యేసునాధుని సేవ||
శోక మొందక యేసు రాకడ కాశించి రంజిల్లు చుండెదము దూత మూఁకలతో గూడి మోద మొప్ప యేసుని పొగడెదము పొగడెదము ||యేసునాధుని సేవ||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.