TG-3997
Telugu

నిన్ను కాపాడు దేవుడ

Ninnu Kaapaadu Devudu

0
views
పల్లవి

నిన్ను కాపాడు దేవుడు కునుకడు నిదురపోడు – నిదురపోడు వాగ్ధానమిచ్చి మాట తప్పడు నమ్మదగినవాడు – నమ్మదగినవాడు భయమేల నీకు – దిగులేల నీకు (2) ఆదరించు యేసు దేవుడు ఉండగా ||నిన్ను కాపాడు||

1వ చరణం

శత్రు బలము నిన్ను చుట్టుముట్టినా శోధనలలో – నిన్ను నెట్టినా (2) కోడి తన పిల్లలను కాచునంతగా కాపాడు దేవుడు నీకు ఉండగా (2) భయమేల నీకు – దిగులేల నీకు (2) కాపాడు గొప్ప దేవుడు ఉండగా ||నిన్ను కాపాడు||

2వ చరణం

రోగ భారమందు లేవకున్ననూ వ్యాధులు నిన్ను కృంగదీసినా (2) చనిపోయిన లాజరును తిరిగి లేపిన స్వస్థపరచు దేవుడు నీకు ఉండగా (2) భయమేల నీకు – దిగులేల నీకు (2) స్వస్థపరచు సత్య దేవుడు ఉండగా ||నిన్ను కాపాడు||