TG-3993
Telugu

నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్య

Ninne Ninne Nammukunnaanayya

0
views
పల్లవి

నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్య నన్ను నన్ను వీడిపోబోకయ్యా (2) నువ్వు లేక నేను బ్రతుకలేనయ్య నీవుంటే నాకు చాలు యేసయ్య (2) ||నిన్నే||

1వ చరణం

కన్నుల్లో కన్నీళ్లు గూడు కట్టినా కన్నవారే కాదని నన్ను నెట్టినా (2) కారు చీకటులే నన్ను కమ్మినా కఠినాత్ములెందరో నన్ను కొట్టినా (2) కఠినాత్ములెందరో నన్ను కొట్టినా ||నిన్నే||

2వ చరణం

చేయని నేరములంటకట్టినా చేతకాని వాడనని చీదరించినా (2) చీకు చింతలు నన్ను చుట్టినా చెలిమే చితికి నన్ను చేర్చినా (2) చెలిమే చితికి నన్ను చేర్చినా ||నిన్నే||