♪♫
TG-4212
Telugu
సమానులెవరు ప్రభో
Samaanulevaru Prabho
0
views
పల్లవి
సమానులెవరు ప్రభో నీ సమానులెవరు ప్రభో (2) సమానులెవరు ప్రభో సమస్త మానవ శ్రమాను భవమును (2) సహించి వహించి ప్రేమించగల (నీ) (2) ||సమానులెవరో||
1వ చరణం
సమాన తత్వము – సహోదరత్వము (2) సమంజసము గాను మాకు దెలుప (నీ) (2) ||సమానులెవరో||
2వ చరణం
పరార్ధమై భవ – శరీర మొసగిన (2) పరోపకారా నరావ తారా (నీ) (2) ||సమానులెవరో||
3వ చరణం
దయా హృదయ యీ – దురాత్మ లెల్లరున్ (2) నయాన భయాన దయాన బ్రోవ (నీ) (2) ||సమానులెవరో||
4వ చరణం
ఓ పావనాత్ముడ – ఓ పుణ్య శీలుడ (2) పాపాత్ములను బ్రోవ – పరమాత్మ సుత (నీ) (2) ||సమానులెవరో||