TG-4654
Telugu

ఈ లోకము నను విడచినను (నా హృదయమంత)

ee lookamu nanu vidachinanu (naa hrudayamanta)

25
views
పల్లవి

ఈ లోకము నను విడచినను నను విడువని నా దేవుడవు ఎవ్వరు లేని ఈ జీవితములో నా తోడు నీవై – నన్నాధుకొంటివి

పల్లవి పూర్వ భాగం

నా హృదయమంత నీ కొరకే సమర్పింతును దేవా నా జీవితమంతా నీ సాక్షిగా నిలిచేదను యేసు నీ మార్గములో నే నడిచేదను – నీ చిత్తములో నే సాగేదను

1వ చరణం

సొలిపోయినా నా ప్రాణము చెయ్యి పట్టి నన్ను లేపితివి. నన్నాధరించి – చేరదీసి కన్నీరు తుడచి – హత్తుకొంటివి ||నా హృదయమంత||

2వ చరణం

యేసయ్యా... నా చింతలన్ని తీరెనయ్య నిన్ను చేరిన క్షణమే. నిత్య జీవితం దొరికేనయ్యా నిన్ను చూసిన క్షణమే (3) నా వ్యాధులన్నీ తొలిగేనయ్య నిన్ను తాకిన క్షణమే నా భయాలన్నీ పోయేనయ్య నిన్ను నమ్మినా క్షణమే

ఇతర

నా అడుగులన్ని స్తిరపరచువాడా నా త్రోవలను సిద్ధపరచువాడా నీ చిత్తములో నన్ను నడుపుమయ్య నీ వాఖ్యముతో నన్ను నింపుమయ్యా

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.