TG-4656
Telugu

ఈ సుదినము యేసు ప్రభువా నీదు దానం

Ee Sudinamu Yeesu Prabhuvaa Needu Daanan

0
views
పల్లవి

ఈ సుదినము - యేసు ప్రభువా - నీదు దానం 1.  పరిశుద్ధంబైన - సమాజకూ-టములన్ మాకు ప్రసాదించి - విస్తారమగు - ప్రేమను జూపి - విజయోత్సవమున్ నడుపుచున్న - యేసు ప్రభువా - నీకే మహిమ 2.  నూతనంబైన - యెరూషలేము - అను పట్టణము భర్తకొరకు - పెండ్లి కుమార్తె - వలె సిద్ధపడి - దేవుని నుండి వచ్చుట చూచి - సంస్తుతించు - చున్నామిలలో 3.  సంపూర్ణంబైన - సిద్ధిని మేము - పొందెదమిలలో స్వచ్ఛంబైన - నీ చిత్తములో - నిలకడ కల్గి - ప్రార్థన యందు పోరాడెదము - నీదు కౄపతో - యేసు ప్రభువా 4.  స్వర్ణాలంకృతమై - సూర్యకాంత - పద్మరాగ - రత్నావళితో యేసు ప్రభుని - మహిమతో మెరిసే - పరిశుద్ధ ప- ట్టణముగ మమ్ము - జేసిన ప్రభువా