స్తోత్ర గానం చేసింది ప్రాణం

sthoothra gaanam cheesindi praannam

🎵 TG-2270🌐 Telugu
పల్లవి

స్తోత్ర గానం చేసింది ప్రాణం క్రొత్త రాగం తీసింది హృదయం నా యేసు ప్రేమ నా మదంతా నిండగా ధన్యమే ఈ జీవితం యేసుతో మరింత రమ్యమే భూమిపై చిన్ని స్వర్గమే యేసుతో నా ప్రయాణమే నా తోడై నా నీడై నాతో ఉన్నాడులే ||ధన్యమే||

1వ చరణం

నా గతం విషాదం – అనంతమైన ఓ అగాధం కోరితి సహాయం – నా యేసు చేసెనే ఆశ్చర్యం లేనిపోని నిందలన్ని పూలదండలై మారెనే ఇన్నినాళ్ళు లేని సంతసాలు నా వెంటనే వచ్చెనే యేసులో నిత్యమే ||స్తోత్ర||

2వ చరణం

ఊహకే సుదూరం – నా యేసు చేసిన ప్రమాణం నా జయం విశ్వాసం – కాదేది యేసుకు అసాధ్యం లేనివన్ని ఉండునట్లు చేసే యేసుతో నా జీవితం పాడలేను ఏ భాషలోనూ ఆనందమానందమే

Report Error