♪♫
TG-3789
Telugu
నా యేసు రాజ్యమ
Naa Yesu Raajyamu
20
views
పల్లవి
నా యేసు రాజ్యము అందమైన రాజ్యము అందులో నేను నివసింతును (2) సూర్య చంద్రులు అక్కర లేని రాజ్యం ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం (2) ||నా యేసు||
1వ చరణం
అవినీతియే ఉండని రాజ్యము ఆకలి దప్పికలు లేని నిత్య రాజ్యం (2) ఇక కరువు కష్టం వ్యాధి బాధ లేని రాజ్యం ఇక లంచం మోసం మొహం ద్వేషం లేని రాజ్యం (2) ||నా యేసు||
2వ చరణం
హల్లెలూయా స్తుతులున్న రాజ్యం యేసే సర్వాధిపతి అయినా సత్య రాజ్యం (2) ప్రేమ శాంతి సమాధానం నిత్యం ఉన్న రాజ్యం నీతి న్యాయం ధర్మం సంతోషం ఉన్న రాజ్యం (2) ||నా యేసు||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.