TG-4298
Telugu

స్తుతి మహిమ యేసు నీకే

Sthuthi Mahima Yesu Neeke

0
views
పల్లవి

స్తుతి మహిమ యేసు నీకే స్తుతి ఘనత ప్రభు నీకే (2) ఆరాధన స్తుతి ఆరాధన (8) ||స్తుతి||

1వ చరణం

కళ్ళల్లో కన్నీరు తుడిచావు గుండె బరువును దింపావు (2) వ్యధలో ఆదరించావు హృదిలో నెమ్మదినిచ్చావు (2) యెహోవా షాలోమ్ ఆరాధన (8) ||స్తుతి||

2వ చరణం

నీవొక్కడవే దేవుడవు మిక్కిలిగా ప్రేమించావు (2) రక్తము నాకై కార్చావు రక్షణ భాగ్యమునిచ్చావు (2) యెహోవా రూహీ ఆరాధన (8) ||స్తుతి||

3వ చరణం

నను బ్రతికించిన దేవుడవు నాకు స్వస్థత నిచ్చావు (2) నా తలను పైకెత్తావు నీ చిత్తము నెరవేర్చావు (2) యెహోవా రాఫా ఆరాధన (8) ||స్తుతి||