♪♫
TG-4377
Telugu
వాక్యమే శరీర ధారియై
Vaakyame Shareera Dhaariyai
0
views
పల్లవి
వాక్యమే శరీర ధారియై వసించెను జీవమై శరీరులను వెలిగింపను ఆ… ఆ…. ఆ… ఆ…. (2) కృపయు సత్యములు – హల్లెలూయ నీతి నిమ్మళము – హల్లెలూయ (2) కలసి మెలసి – భువిలో దివిలో (2) ఇలలో సత్యము మొలకై నిలచెను ||వాక్యమే||
1వ చరణం
ఆశ్చర్యకరుడు – హల్లెలూయ ఆలోచనకర్త – హల్లెలూయ (2) నిత్యుడైన – తండ్రి దేవుడు (2) నీతి సూర్యుడు – భువినుదయించెను ||వాక్యమే||
2వ చరణం
పరమ దేవుండే – హల్లెలూయ నరులలో నరుడై – హల్లెలూయ (2) కరము చాచి – కనికరించి (2) మరు జన్మములో మనుజుల మలచే ||వాక్యమే||