♪♫
TG-1360
Telugu
విలువేలేని నా జీవితం
viluveeleeni naa jeevitham
64
views
పల్లవి
విలువేలేని నా జీవితం – నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే జీవమే లేని నాలో నీ – జీవమును నింపుటకు నీ జీవితాన్నే ధారబోసితివే (2) నీది శాశ్వత ప్రేమయా – నేను మరచిపోలేనయా ఎన్ని యుగాలైనా మారదు ఎండిన ప్రతి మోడును – మరలా చిగురించును నా దేవునికి సమస్తము సాధ్యమే పాపములో పడిన నన్ను శాపములో మునిగిన నన్ను నీ ప్రేమతో లేపితివే రోగమే నన్ను చుట్టుకొనియుండగా రోదనతో ఒంటరినైయుండగా నా కన్నీటిని తుడిచితివే (2) ||నీది||
1వ చరణం
పగలంతా మేఘ స్తంభమై రాత్రంతా అగ్ని స్తంభమై దినమంతయు రెక్కలతో కప్పితివే స్నేహితులే నన్ను వదిలేసినా బంధువులే భారమని తలచినా నా కొరకే బలి అయితివే సాధ్యమే సాధ్యమే సాధ్యమే నా యేసుకు సమస్తము నా ప్రియునికి సమస్తము ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును (2) ||విలువేలేని||