TG-4439
Telugu

యెహోవాకు స్తుతులు పాడండి

Yehovaaku Sthuthulu Paadandi

0
views
పల్లవి

యెహోవాకు స్తుతులు పాడండి – మీరు సమాజములో ప్రభు ప్రశంస పాడి సభలో పాడండి మీరు యెహోవాకు ఇశ్రాయేలు తమ సృష్టికర్తను సీయోను వాసులు తమ రాజును స్మరియించుకొని సంతోషింతురు నాట్యమాడి తన స్తుతి పాడండి – మీరు ||యెహోవాకు||

1వ చరణం

తంబురతోను సితారతోను తనను గూర్చి గానము చేసి దేవుని ప్రేమరసమును గ్రోలి పావనాలంకారమును బొంది – మీరు ||యెహోవాకు||

2వ చరణం

భక్తులై ఘనులై హర్షింతురు ఉత్సాహమున ఊప్పొంగెదరు పడకల మీద ప్రభువును కోరి పాడి పాడి ప్రభువును దలచెదరు – మీరు ||యెహోవాకు||

3వ చరణం

అన్య జనులను శిక్షించుటకు రాజుల గొలుసుతో బంధించుటకు రెండంచుల ఖడ్గమును ధరించిరి దైవ భక్తులకు ఘనత యునిదే – మీరు ||యెహోవాకు||