TG-3991
Telugu

నింగిలో దేవుడు

Ningilo Devudu

0
views
పల్లవి

నింగిలో దేవుడు నిను చూడ వచ్చాడు ఆ నీతి సూర్యుడు శ్రీ యేసు నాధుడు (2) చెంత చేరి సంతసించుమా (2) స్వంతమైన క్రీస్తు సంఘమా ||నింగిలో||

1వ చరణం

పాపాల పంకిలమై శోకాలకంకితమై మరణించి మన కోసం కరుణించి ఆ దైవం (2) దీన జన రక్షకుడై దేవ దేవుని సుతుడై (2) జన్మించె నీ కోసం ధన్యము చేయగా (2) ||నింగిలో||

2వ చరణం

సాతాను శోధనలే శాపాల వేదనలై విలపించే దీనులకై అలరించు దీవెనలై (2) శరణమై ఉదయించే తరుణమౌ ఈ వేళ (2) గుండె గుడి పానుపులో చేర్చుకొన రావేల (2) ||నింగిలో||