TG-3987
Telugu

నిబ్బరముతో నా యేసుకే

Nibbaramutho Naa Yesuke

17
views
పల్లవి

నిబ్బరముతో నా యేసుకే స్తుతి పాడెదా వేకువనే లేచి నా ప్రభునే కొనియాడెదా (2) యేసయ్యా… యేసయ్యా… స్తుతులకు పాత్రుడవు నీవయ్యా యేసయ్యా… యేసయ్యా… మాహిమ ఘనతలు నీకయ్యా (2) ||నిబ్బరముతో||

1వ చరణం

కష్టకాలమందు నాకు – కనికరము చూపెను కాలుజారుతున్నవేళ – కరుణతో నిలిపెను (2) కడుపు కాలుతున్నవేళ – నా కడుపు నింపెను కన్నిటి బ్రతుకును – నాట్యముగా మార్చెను కఠినమైన కాలములో – నా చెంత నిలిచెను ||యేసయ్యా||

2వ చరణం

దిక్కుదెసలేని నాకు – దర్శనము నిచ్చెను ధనము ఘనము లేని నాకు ఘనతనెంతో నిచ్చెను (2) దిక్కుతోచని వేళ – నా దిక్కై నిలిచెను దుష్ట శక్తులన్నిటిని – నాకు దూరపరచెను దీవెనలు కుమ్మరించి – ధన్యునిగా చేసెను ||యేసయ్యా||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.