TG-3989
Telugu

నిజమైన ద్రాక్షావల్లి నీవే

Nijamaina Draakshaavalli

0
views
పల్లవి

నిజమైన ద్రాక్షావల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే (2) శాశ్వతమైనది ఎంతో మధురమైనది నాపైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ – (2) ||నిజమైన||

1వ చరణం

అతి కాంక్షనీయుడా దివ్యమైన నీ రూపులో జీవించున్నాను నీ ప్రేమకు నే పత్రికగా (2) శిధిలమై యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా (2) ||నిజమైన||

2వ చరణం

నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా (2) వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా (2) ||నిజమైన||

3వ చరణం

షాలేము రాజా రమ్యమైన సీయోనుకే నను నడిపించుము నీ చిత్తమైన మార్గములో (2) అలసి పోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి ఆదరణ కర్తవై నను చేర్చుము నీ రాజ్యములో (2) ||నిజమైన||