TG-3990
Telugu

నిజముగా మొర పెట్టిన

nijamugaa mora pettina

21
views
పల్లవి

నిజముగా మొర పెట్టిన దేవుడాలకించకుండునా సహనముతో కనిపెట్టిన సమాధానమీయకుండునా జీవముగల దేవుడు మౌనముగా ఉండునా తన పిల్లలకాయన మేలు చేయకుండునా (2) ||నిజముగా||

1వ చరణం

పరలోక తండ్రినడిగిన మంచి ఈవులీయకుండునా (2) కరములెత్తి ప్రార్థించినా దీవెనలు కురియకుండునా (2) ||జీవముగల||

2వ చరణం

సృష్టి కర్త అయిన ప్రభువుకు మన అక్కర తెలియకుండునా (2) సరి అయిన సమయానికి దయచేయక ఊరకుండునా (2) ||జీవముగల||

3వ చరణం

సర్వశక్తుడైన ప్రభువుకు సాధ్యము కానిదుండునా (2) తన మహిమ కనపరచుటకు దయ చేయక ఊరకుండునా (2) ||జీవముగల||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.