TG-399
Telugu

భయము నొందకుము క్రైస్తవ సహోదర

bhayamu nondakumu kraisthava sahoodara

201
views
పల్లవి

భయము నొందకుము క్రైస్తవ సహోదర యింక భయము నొంద కుము భయము నొందకుము హృదయ వాసుఁడగు క్రీస్తు దయ నీ తలఁపు లెల్ల రయముగ నెరవేర్చు ||భయము నొందకుము||

1వ చరణం

దీవింపఁబడెడు జగమున కిరుకౌ త్రోవ జను నపుడు భావ జ్ఞానము వీడ భయపుఁ జీఁకటి గూడుఁ గావున మది యేసు భావింప గతి జేర్చు ||భయము నొందకుము||

2వ చరణం

నీ యాత్మఁ జూచి కయ్యము జేయ డాయు పిశాచి యా యుద్ధమున బ్రత్య య మ్మనెడు డాల్బట్ట నా యెడఁ గ్రీస్తు స హాయుఁడై గెల్పించు ||భయము నొందకుము||

3వ చరణం

జగము నిన్బట్టి వెన్కకు నీడ్చి పగఁ దీరఁ గట్టి యెగతాళి గావించు టెఱింగి క్రీస్తుని పిల్వఁ డగఁబట్టు మపుడు నీ పగ మాన్పి విడిపించు ||భయము నొందకుము||

4వ చరణం

కలుష జాలంబు మాయా కీట కముల జాలంబు గల బావి నీ యాత్మ గలియకుండఁగ యేసుఁ దలఁచు మప్పుడు నిం జే తంబట్టి కాపాడు ||భయము నొందకుము||

5వ చరణం

శ్రమ దండనముల శిశు శిక్షించు జనకు విధముల సమకూర్చు నీ దేవుఁ డమిత ప్రేమను గాంచి యమలమౌ మతి నోర్చు మపుడు మేలిడు నీకు ||భయము నొందకుము||

6వ చరణం

కన నీదు చటుల దుఃఖాదు లె ట్లను వీడు నటులఁ గొన దినమున న్యాయ మును దీర్పఁగాఁ క్రీస్తు చను దెంచి నిత్య జీ వన కిరీటము నిచ్చు ||భయము నొందకుము||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.