TG-4528
Telugu

యేసుని ప్రేమ యేసు వార్త

Yesuni Prema Yesu Vaartha

0
views
పల్లవి

యేసుని ప్రేమ యేసు వార్త వాసిగ చాటను వెళ్ళెదము ఆశతో యేసు సజీవ సాక్షులై దిశలన్నిటను వ్యాపించెదము వినుము ప్రభుని స్వరము (2) ప్రభు యేసు సన్నిధి తోడు రాగా కడుదూర తీరాలు చేరెదము ||యేసుని||

1వ చరణం

మరణ ఛాయ లోయలలో నాశన కూపపు లోతులలో (2) చితికెను బ్రతుకులెన్నో (2) ప్రేమ తోడను చేరి వారిని ప్రభు యేసు కొరకై గెలిచెదము ||యేసుని||

2వ చరణం

కాపరి లేని గొర్రెలుగా వేసారెనుగ సమూహములే (2) ప్రజలను చూచెదమా (2) ప్రేమ తోడను చేరి వారిని ప్రభు యేసు కొరకై గెలిచెదము ||యేసుని||