TG-3422
Telugu

గొర్రెపిల్ల రక్తములో

Gorrepilla Rakthamulo

0
views
పల్లవి

గొర్రెపిల్ల రక్తములో కడుగబడినవారే పరిశుద్ధులు (2) పరిశుద్ధుడా యేసయ్యా.. నను శుద్ధి చేయుమయా (2) నను శుద్ధి చేయుమయా ||గొర్రెపిల్ల||

1వ చరణం

ఆకాశము ఈ భూమియు గతియించినా గతియించవు నీ మాటలు (2) శాశ్వతమైనది నీ రాజ్యము (2) ఆ రాజ్యములో నన్ను చేర్చుమయా… యేసయ్యా ||గొర్రెపిల్ల||

2వ చరణం

వేవేళ దూతలు అనునిత్యము కొనియాడుచున్న ఆ పరలోకము నీ సింహాసనం (2) పరిశుద్ధులతో నిండిన నీ రాజ్యము (2) ఆ రాజ్యములో నన్ను చేర్చుమయా… యేసయ్యా ||గొర్రెపిల్ల||