♪♫
TG-3423
Telugu
గొర్రెపిల్ల వివాహోత్సవ
Gorrepilla Vivaahotsava
0
views
పల్లవి
గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి (2) సర్వాధికారియు సర్వోన్నతుండైన (2) మన తండ్రిని ఘనపరచి మనముత్సహించెదము (2) ||గొర్రెపిల్ల||
1వ చరణం
సిద్ధపడెను వధువు సుప్రకాశము గల (2) నిర్మల వస్త్రములతో నలంకరించుకొనెన్ (2) ||గొర్రెపిల్ల||
2వ చరణం
పరిశుద్ధుల నీతి క్రియలే యా వస్త్రములు (2) గొర్రె పిల్ల రక్తములో శుద్ధి నొందిన వారు (2) ||గొర్రెపిల్ల||
3వ చరణం
తెల్లని గుర్రముపై కూర్చుండినవాడు (2) నమ్మకమై యున్నట్టి పెండ్లి కుమారుండు (2) ||గొర్రెపిల్ల||
4వ చరణం
దేవుని వాక్యమను నామము గలవాడు (2) రక్తములో ముంచిన వస్త్రమున్ ధరియించె (2) ||గొర్రెపిల్ల||
5వ చరణం
ప్రేమించి సంఘముకై ప్రాణంబు నిదె ప్రభువు (2) పరిశుద్ధ పరచుట కొరకై తానప్పగించుకొనెన్ (2) ||గొర్రెపిల్ల||
6వ చరణం
శ్రీ యేసు క్రీస్తుండే సంఘంబునకు శిరస్సు (2) వాక్య ఉదకము తోడ శుద్ధి పరచుచుండె (2) ||గొర్రెపిల్ల||