ఆ చిన్న వారిలో నేనుండి

aa chinna vaariloo neenundi

🎵 TG-546💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

ఆ చిన్న వారిలో నేనుండి యున్న నహాహా మా యేసును నేఁ జూచి యుందు ||ఆ చిన్న||

1వ చరణం

ప్రభు యేసు ప్రపంచమం దుండినపుడు పసి బాలకులఁ బిల్చి ప్రార్థించె ననెడు ప్రాచీన కథను నేఁ జదువుచున్నప్పుడు వారిలో నే నున్న నెంతో బాగుండు ||ఆ చిన్న||

2వ చరణం

ఆ కరుణ కరము నా తలపైని వ్రాలి యాకాశ బాహువు నా చుట్టు నిలిచి య నేక బాలకుల రానిమ్మను జాలి తోఁ గర్త పిలుపు విన నాకెంతో మేల్మి ||ఆ చిన్న||

3వ చరణం

ఇ కమీఁదఁ బ్రార్థన ద్వారా దర్శింతున్ బ్రకటిత ప్రభు ప్రేమ పంచి యియ్యమందు న మ్మకముతో యేసుని వెదకుచు నుందు సుఖ లోకమందునఁ జూచి వినుచుందు ||ఆ చిన్న||

4వ చరణం

శుద్ధుల కొఱకు రాజ్యము నేలన్ సిద్ధము చేయఁ బ్రభు యేసు వెళ్లెన్ ముద్దు పాపలు వత్తు రందున విను మ శ్రద్ధ సేయకు వారి దాకాశ రాజ్య ||ఆ చిన్న||

Report Error