♪♫
0
views
పల్లవి
శాశ్వత ప్రేమతో ప్రేమించుచు విడువక నా యెడల కృప చూపుచున్నావు (2) యేసయ్యా స్తోత్రము - యేసయ్యా వందనం (2)
1వ చరణం
1. నన్నెంతో నీవు ప్రేమించి - దివినుండి భువికి దిగి వచ్చినావు నా కొరకు నీ ప్రాణమును బలిగా అర్పించి బ్రతికించినావు (2) ||యేసయ్యా||
2వ చరణం
యజమానుడా నీ సన్నిధిలో - ప్రతి అక్కరను తీర్చేదవు నీ ప్రేమను శాశ్వత కృపను - మరువక నిత్యము ధ్యానింతును (2) ||యేసయ్యా||
3వ చరణం
కనుపాపలా కాపాడితివి - చేతులెక్కి నీకు మ్రొక్కేదను నీ కృపలను నేను తలంచుచు - ఉత్సాహ గానము చేసెదను (2) ||యేసయ్యా|| నీకే వందనం - నీకే వందనం (4)
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.