విడుదల (యేసులో విడుదల)
vidudala (yeesuloo vidudala)
పరి పరి విధముల పదముల నరసి మరి మరి కోరి పాపం చేసి విడుదల లేని బ్రతుకును బ్రతికి బందీగా నిలిచా ఎరిగి ఎరిగి చెడుగును చేసి తలచి తలచి ఎంతో వదచా సరదా బురదా మనసుకు రాసి రక్షణకై లేచా సిలువే శరణం యేసు యేసు పాదాల చెంత పాపం జీతం మరణం యేసుకొప్పగించేసా
విడుదల విడుదల విడుదల విడుదల యేసులో విడుదల విడుదల విడుదల విడుదల విడుదల యేసులో విడుదల
భరించాడు భరించాడు నేను చేసిన పాపములు సహించాడు సహించాడు నా వ్యసనములన్నిటిని భరించాడు నేను చేసిన పాపములు సహించాడు నా వ్యసనములన్నిటిని రక్షించాడు రక్తములో కడిగి వచ్చేసాడు నా హృదయములోనికి వచ్చేసాడు నన్నడిగి నన్నడిగి ||విడుదల||
ప్రేమించాడు ప్రేమించాడు నేను పాపిగా ఉన్నప్పుడే క్షమించాడు క్షమించాడు నేను శరణము వేడగని ప్రేమించాడు నేను పాపిగా ఉన్నప్పుడే క్షమించాడు నేను శరణము వేడగని హెచ్చించాడు హెచ్చించాడు స్నేహితుడని పిలిచి వరిస్తాడు వరిస్తాడు త్వరలో వధువు సంఘముగా మార్చి ||విడుదల||
ప్రేమ చూపి పిలిచాడు ప్రాణమిచ్చి నిలిపాడు ఈ లోకమంతటిలో నీకు సమమెవరు స్వరమెత్తి కీర్తింతూ బ్రతుకంతా చాటింతు సిలువే చరణం పాపం మరణం యేసునిలో నిత్యజీవం ||విడుదల||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.