TG-3324
Telugu

నేర్పరి అయనా శిల్పకారుడవై

neerpari ayanaa shilpakaarudavai

Blessing Kumarవిజయ్ · Vijayపాస్టర్ కరుణ్ కుమార్ · Pastor Karun kumar
0
views
పల్లవి

నేర్పరి అయనా శిల్పకారుడవై నీ రూపమే నాలో రూపించుచున్నావే (2) ఇది నా భాగ్యమే ఇది నీ కృపయే (2) యేసయ్యా నా ప్రియుడా (2) ||నేర్పరి||

1వ చరణం

నీ చేతులే నన్ను నిర్మించెను నీ రూపము నాలో ఏర్పరచెను (2) నీకై జీవించుచు నీతో నే నడతును (2) ||నేర్పరి||

2వ చరణం

మహిమ ప్రభావములు ధరింపజేసి నీ చేతి పనులపై అధికారమిచ్చితివి (2) నీకే నా అర్పణ నీకే స్తోత్రార్పణ (2) ||నేర్పరి||

3వ చరణం

పరిపూర్ణ సౌందర్య సీయోనుగా నన్ను కట్టుచున్న సుందరుడా (2) నీకై కనిపెట్టుచు నీలో ఫలించెదా (2) ||నేర్పరి||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.