TG-1976
Telugu

ఆ రాజే నా రాజు

aa raajee naa raaju

89
views
పల్లవి

ఆ రాజే నా రాజు – నా రాజే రారాజు నా రాజు రాజులకు రాజు (2) యేసు పుట్టెను ఈ లోకంలో ఆనందమే గొప్ప ఆనందమే సంతోషమే సర్వలోకమే (2) ||ఆ||

1వ చరణం

యెష్షయి మొద్దున – దావీదు చిగురుగా లోక రక్షకుడు జన్మించెను లోక పాపాలను కడిగి వేయగా భువిలో బాలుడిగా అరుదించెను పరిశుద్ధాత్మ మూలముగా జన్మించెను మన పాపాలకు విరుగుడు మందును (తెచ్చెను) (తెచ్చి అందించెను) (2) ||ఆనందమే||

2వ చరణం

వీనుల విందుగా – దీనుల అండగా కరుణా కారకుడు కడలివచ్చెను పాపుల శాపాలను తానే మోయగా పరమ పాలకుడు పుడమి చేరెను కుల మత బేధాలను హరియించ వచ్చెను పరలోకానికి చేర్చే (మార్గమాయెను) (మార్గమై తనే నిలిచెను)

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.