♪♫
TG-1032
Telugu
ఎన్నాళ్ళు ఎదురీత నా యేసువా
ennaallu edureeta naa yeesuvaa
197
views
పల్లవి
ఆ........ఆ..........ఆ......... ఎన్నాళ్ళు ఎదురీత నా యేసువా - ఎన్నేళ్ళ యెదకోత నా ప్రభువా కలనైన నిన్ను నే వీడిపోను - నా నేస్తమై నీవురా..నా నీడవై నిలువరా
1వ చరణం
కన్నీటి మేఘాలు నను కమ్ముకోగా - కష్టాల కనుమల్లో నే కూరుకోగా నీ చేతి నందించి నను లేపుమా - యెదలోని చీకట్లు ఇక మాపుమా రా... రా... నాజీవమా...నీవే నాదైవమా... ||ఆ..ఆ..ఆ..ఎన్నాళ్ళు||
2వ చరణం
పాపల్లే అడుగేస్తు నీ చెంతకొచ్చా - రెప్పల్లే నను నీవు కాపాడు స్వామి నాలోని శాపాలు తొలగించవా - నా సూన్య బంధాలు చెరిపేయవా దేవా... మన్నించవా...రావా...దయచూపవా... ||ఆ..ఆ..ఆ..ఎన్నాళ్ళు||