ఆధారం నాకు ఆధార
Aadhaaram Naaku Aadhaaram
ఆధారం నాకు ఆధారం నాకు తోడునీడై ఉన్న నీ కృపయే ఆధారం ఆశ్రయమూ నాకు ఆశ్రయమూ ఆపత్కాలమందు ఆశ్రయమూ నీ నామం ఆశ్రయమూ తల్లితండ్రి లేకున్నా – బంధుజనులు రాకున్నా లోకమంత ఒకటైనా – బాధలన్ని బంధువులైనా ||ఆధారం||
భక్తిహీన బంధంలో నేనుండగా శ్రమల సంద్రంలో పడియుండగా (2) ఇరుకులో విశాలతనూ కలిగించిన దేవా (2) నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగ రావా (2) ||ఆధారం||
దారిద్య్రపు సుడినుండి ఐశ్యర్యపు తీరానికి నీ స్వరమె నా వరమై నడిపించిన యేసయ్యా (2) విడువను ఎడబాయనని పలికిన నా దేవా (2) నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగ రావా (2) ||ఆధారం||
దిగులుపడిన వేళలలో దరిచేరిన దేవా అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా (2) చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా (2) నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగ రావా (2) ||ఆధారం||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.