TG-3007
Telugu

ఆధారం నీవేనయ్

Aadhaaram Neevenayyaa

0
views
పల్లవి

ఆధారం నీవేనయ్యా నా ప్రభువా… ఆధారం నీవేనయ్యా మాయా లోకములోనే తలక్రిందులైపోగా (2) ||ఆధారం||

1వ చరణం

మాతా పితలే నన్ను – హీనంగా చూచుచుండ (2) పరులకు లెక్కెంతయ్యా అల్పునిపై.. పరులకు లెక్కెంతయ్యా అల్పునకు ||ఆధారం||

2వ చరణం

నా తోడు నీవన్న – నీతి ప్రబోధకులు (2) నడి యేట వీడిరయ్యా ఏకాంతునిగా… నడి యేట వీడిరయ్యా ఏకాంతునకు ||ఆధారం||

3వ చరణం

శోధనలెగసి – వేదన వెన్నంటి (2) దుఃఖం పొంగే వేళలో నా సుకృతమా.. దుఃఖం పొంగే వేళలో నీ దాసునకు ||ఆధారం||

4వ చరణం

విద్వాంసుల శిఖరం – విదుతుల నేస్తం (2) నిండు కృపానిధియే నా విభుడా.. నిండు కృపానిధియే నా విభుడా ||ఆధారం||