TG-3010
Telugu

ఆదియంతము లేనివాడా

Aadiyanthamu Leni Vaadaa

29
views
పల్లవి

ఆదియంతము లేనివాడా సంపూర్ణుడగు మా దేవా నీతిజ్ఞానము కలవాడా జ్యోతికి నిలయము నీవే అబ్రాహామును పిలిచితివి – ఆ వంశమున బుట్టితివి అనాధులకు దిక్కు నీవే – అనాధుడవై వచ్చితివి ||ఆదియంతము||

1వ చరణం

ఇస్సాకును విడిపించి – యేసయ్యా బలియైనావా యూదాచే నమ్మబడితివి – పాపులకై మరణించితివి ||ఆదియంతము||

2వ చరణం

యోనావలె మూడు దినముల్ – భూగర్భమున నీవుండి మానవులను రక్షింప – మహిమతోడ లేచితివి ||ఆదియంతము||

3వ చరణం

పండ్రెండు గోత్రముల – జెంది – పండ్రెండు శిష్యుల జనకా కన్యపుత్రుడవై సీయోను – కన్యను వరించితివి ||ఆదియంతము||

4వ చరణం

దావీదు కుమారుడవు – దావీదుకు దేవుడవు కాపాడుచు నున్నావు – పాపిని నన్ను ప్రేమించి ||ఆదియంతము||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.