TG-3011
Telugu

ఆగక సాగుమా

Aagaka Saagumaa

21
views
పల్లవి

ఆగక సాగుమా సేవలో ఓ.. సేవకా ఆగక సాగుమా సేవలో సేవకా (2) ప్రభువిచ్చిన పిలుపును మరువక మానక (2) ||ఆగక||

1వ చరణం

పిలిచినవాడు ప్రభు యేసుడు ఎంతైనా నమ్మదగినవాడు (2) విడువడు నిన్ను ఎడబాయడు నాయకుడుగా నడిపిస్తాడు (2) ||ఆగక||

2వ చరణం

తెల్లబారిన పొలములు చూడు కోత కోయను సిద్ధపడుము (2) ఆత్మల రక్షణ భారముతో సిలువనెత్తుకొని సాగుము (2) ||ఆగక||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.