TG-3012
Telugu

ఆగని పరుగులో ఎండిన

Aagani Parugulo Endina

21
views
పల్లవి

ఆగని పరుగులో ఎండిన ఎడారులు (2) కృంగిన బ్రతుకులో నిండిన కొరతలు ఉన్నపాటునా నలిగె నా వైపున కదలిరాలేవా ఆదరించగ రావా కన్నీరే నా మజిలీ – దరి చేరే నీ జాలి లాలించే నీ ప్రేమ – నా ప్రాణమై కరుణించే నీ చూపు – మన్నించే నా మనవి అందించే నీ చేయి – నా స్నేహమై ||ఆగని||

1వ చరణం

లోకప్రేమే సదా – కలల కడలే కదా తరంగమై కావుమా – తిరిగి తీరమునకు (2) నీవే కదా ఆధారం – సదా నీకే దాసోహం యేసయ్యా… అర్పించెదా – నా జీవితం ||ఆగని||

2వ చరణం

ఎదుట నిలిచె నీవే – ప్రేమకు రూపం నీవే కృపామయా కావుమా – జార విడువకు నన్ను (2) నీవే కదా నా మూలం – సదా నీపై నా భారం యేసయ్యా… ప్రేమించెదా – కలకాలము ||ఆగని||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.