♪♫
TG-3013
Telugu
ఆహా ఆనందమే
Aahaa Aanandame
0
views
పల్లవి
ఆహా ఆనందమే పరమానందమే ప్రియ యేసు నొసగె నాకు కొలత లేనిది బుద్ధికందనిది ప్రేమన్ వివరింప వీలగునా ||ఆహా||
1వ చరణం
నీచ ద్రోహినైన నన్ ప్రేమతో చేర్చుకొనే (2) పాప ఊభి నుండి నన్ పైకి లేవనెత్తెను (2) ||ఆహా||
2వ చరణం
నిత్య నాశన పురమునకు నే పరుగిడి వెళ్ళుచుండ (2) నిత్య జీవ మార్గములో నన్ను నడిపితివి (2) ||ఆహా||
3వ చరణం
నీ ప్రేమ స్వరమున్ విని నేను మేలుకొంటిని (2) ప్రియుని రొమ్మును చేరను నాలో వాంఛ ఉప్పొంగుచుండె (2) ||ఆహా||
4వ చరణం
మధ్యాకాశము నందున ప్రభుని చేరెడు వేళలో (2) ఆనందమానందమే ఎల్లప్పుడానందమే (2) ||ఆహా||