TG-2529
Telugu

ఆహా ఆనందమే పరమానందమే ప్రియ

aahaa aanandamee paramaanandamee priya

93
views
పల్లవి

ఆహా ఆనందమే పరమానందమే ప్రియ యేసు నొసగె నాకు కొలత లేనిది బుద్ధికందనిది ప్రేమన్ వివరింప వీలగునా ||ఆహా||

1వ చరణం

నీచ ద్రోహినైన నన్ ప్రేమతో చేర్చుకొనే (2) పాప ఊభి నుండి నన్ పైకి లేవనెత్తెను (2) ||ఆహా||

2వ చరణం

నిత్య నాశన పురమునకు నే పరుగిడి వెళ్ళుచుండ నిత్య జీవ మార్గములో నన్ను నడిపితివి నీ ప్రేమ స్వరమున్ విని నేను మేలుకొంటిని ప్రియుని రొమ్మును చేరను నాలో వాంఛ ఉప్పొంగుచుండె మధ్యాకాశము నందున ప్రభుని చేరెడు వేళలో ఆనందమానందమే ఎల్లప్పుడానందమే

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.