TG-431
Telugu

ఆహా నాకేమానందము శ్రీ యేసు

aahaa naakeemaanandamu shree yeesu

204
views
పల్లవి

ఆహా నాకేమానందము శ్రీ యేసు నాచేఁ బట్టుచు సహాయుఁడై నాయన్నిటన్ సజీవుఁడై నడుపును. ||ఆహా నాకేమానందము||

1వ చరణం

యేదే స్సుఖంబు లైనన్ సదా విచార మైనను బాధాంధకార మైనను ముదంబుతోడ నుందును. ||ఆహా నాకేమానందము||

2వ చరణం

చింతేల నాకు నీ దయన్ సంతత మీవు తోడుగాన్ బంతంబు నీచేఁ బట్టుచు సంతృప్తితో నే నుందును. ||ఆహా నాకేమానందము||

3వ చరణం

నా చావు వేళ వచ్చినన్ విచార మొందక ధృతిన్ నీ చేయి బట్టి యేసుఁడా నీ చారు మోక్ష మెక్కుదున్ ||ఆహా నాకేమానందము||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.