♪♫
TG-3016
Telugu
ఆహా యేమానందం ఆహా
Aahaa Yemaanandam Aahaa
0
views
పల్లవి
ఆహా యేమానందం ఆహా యేమానందము చెప్ప శక్యమా (2) ఆహా మా రాజగు యేసు మా వృజినముల మన్నించి వేసెను (2) ||ఆహా||
1వ చరణం
ముదముతో నాడుచు కూడుచు పాడుచు ఆర్భాటించెదము (2) వెదకుచు వచ్చిన యేసును హృదయాన కోరి స్తుతింతుము (2) ||ఆహా||
2వ చరణం
అక్షయుడగు ప్రేమతో రక్షణ బాకాను గ్రహించినందున (2) రక్షకుడు యేసును గూర్చి మా సాక్ష్యము నిశ్చయముగా నిత్తుము (2) ||ఆహా||
3వ చరణం
తెల్లంగి వాద్యము స్వర్ణ కిరీటము మేడపై జయ జెండాల్ (2) ఉల్లాసించి మంటి నుండి మింట కేగిన రాజున్ స్తుతింతుము (2) ||ఆహా||