♪♫
TG-3018
Telugu
ఆకాశ పక్షులను చూడండి
Aakaasha Pakshulanu Choodandi
16
views
పల్లవి
ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు అవి కోయవు గరిసెలలో దాచుకోవూ కొట్లలో కూర్చుకోవు ||ఆకాశ||
1వ చరణం
అనుదినము కావలసిన ఆహారము అందజేయును వాటికి ఆ దేవుడు కలసికట్టుగా అవి ఎగిరి పోతాయి కడుపు నింపుకొనిపోయి మరల తిరిగి వస్తాయి ||ఆకాశ||
2వ చరణం
స్వార్ధము వంచన వాటికుండదు సాటివాని దోచుకొనే మనసు ఉండదు రేపటిని గూర్చిన చింత ఉండదు పూట ఎలా గడపాలని బాధ ఉండదు ||ఆకాశ||
3వ చరణం
పక్షులను పోషించే ఆ దేవుడు మనుష్యులను పోషించుట మానివేయునా సృష్టిలోన మనిషి బ్రతుకు శ్రేష్టము కదా ప్రభువు తోడు ఉండగా మనకు ఎందుకు బాధ ||ఆకాశ||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.