♪♫
TG-3021
Telugu
ఆకాశం నీ సింహాసన
Aakaasham Nee Simhaasanam
45
views
పల్లవి
ఆకాశం నీ సింహాసనం భూమి నీ పాదపీఠం (2) సర్వోన్నతుడా సర్వాధికారి అందుకో ఇల నా హృదయ వందనం అల్ఫయు నీవే ఒమేగయు నీవే – (2) మార్గము నీవే – జీవము నీవే ||ఆకాశం||
1వ చరణం
పరలోక తెరపైట తొలగించగా స్తుతి గీత పాటలు వినిపించగా (2) పరిశుద్ద ఆత్ముడు నను తాకగా రగిలింది నా మనస్సు ఒక జ్వాలగా ||ఆకాశం||
2వ చరణం
నీ స్వరము ఉరుమై వినిపించగా అదిరింది నా గుండె ఒకసారిగా (2) నీ కిరణాలు మెరుపై నను తాకగా వెలిగింది నా మనస్సు ఒక జ్యోతిగా ||ఆకాశం||
3వ చరణం
భువిలోని సృష్ఠంత నీ మాటగా దివిలోని ఊపిరి నీ శ్వాసగా (2) పరలోక రాజ్యానికి నువ్వు దారిగా వెలిసావు ధరపైన నా యేసుగా ||ఆకాశం||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.