TG-1693
Telugu

ఆకాశం నీ సింహాసనం భూమి

aakaasham nee sinhaasanam bhuumi

77
views
పల్లవి

ఆకాశం నీ సింహాసనం భూమి నీ పాదపీఠం (2) సర్వోన్నతుడా సర్వాధికారి అందుకో ఇల నా హృదయ వందనం అల్ఫయు నీవే ఒమేగయు నీవే – మార్గము నీవే – జీవము నీవే ||ఆకాశం||

1వ చరణం

పరలోక తెరపైట తొలగించగా స్తుతి గీత పాటలు వినిపించగా పరిశుద్ద ఆత్ముడు నను తాకగా రగిలింది నా మనస్సు ఒక జ్వాలగా నీ స్వరము ఉరుమై వినిపించగా అదిరింది నా గుండె ఒకసారిగా నీ కిరణాలు మెరుపై నను తాకగా వెలిగింది నా మనస్సు ఒక జ్యోతిగా భువిలోని సృష్ఠంత నీ మాటగా దివిలోని ఊపిరి నీ శ్వాసగా పరలోక రాజ్యానికి నువ్వు దారిగా వెలిసావు ధరపైన నా యేసుగా

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.