TG-3023
Telugu

ఆకాశమందు నీవుండగా

Aakaashamandu Neevundagaa

24
views
పల్లవి

ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను నీవీ లోకములో నాకుండగా నేను దేనికి భయపడను (2) శత్రుసమూహము నన్ను చుట్టినా సైతనుడు సంహరింపజూసినా (2) నా సహవాసిగా నీవుండగా నేను ఎవరికి భయపడను (2) ||ఆకాశమందు||

1వ చరణం

వ్యాధులు కరువులు శోధనలు బాధలు దుఃఖము వేదనలు (2) మరణము మ్రింగగ కాంక్షించినా నేను దేనికి భయపడను (2) ||ఆకాశమందు||

2వ చరణం

పడిపోయిన వెనుకంజ వేయక పశ్చాత్తాపము పడి అడుగు (2) నిను క్షమియించును నీ ప్రభువే నీవు ఎవరికి భయపడకు (2) ||ఆకాశమందు||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.