♪♫
TG-1289
Telugu
ఆకాశమందున్న ఆసీనుడా
aakaashamandunna aaseenudaa
206
views
పల్లవి
ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను - నేను నీ తట్టు కనులెత్తుచున్నాను
1వ చరణం
దారి తప్పిన గొర్రెను నేను త్రోవ కానక తిరుగుచున్నాను కరుణించుమా యేసు కాపాడుమా నీ తట్టు కనులెత్తుచున్నాను ||ఆకాశ||
2వ చరణం
గాయపడిన గొర్రెను నేను బాగుచేయుమా పరమవైద్యుడా ||కరుణించుమా||
3వ చరణం
పాప ఊబిలో పడివున్నాను లేవనెత్తుమా బాగుచేయుమా ||కరుణించుమా||
4వ చరణం
ఎండిపోయిన ఎముకను నేను ఆత్మ నింపుము బ్రతికించుము ||కరుణించుమా||
5వ చరణం
పనికి రాని పాత్రను నేను సరిచేయుమా ప్రభు వాడుకొనుమా ||కరుణించుమా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.