ఆకాశమంత మెరిసిపోయేను ఓ వింత తారతో
Aakaashamantha Merisipooyeenu Oo Vintha Thaarathoo
ఆకాశమంత మెరిసిపోయేను ఓ వింత తారతో పుడమి అంతా పరవశించేను ప్రభూ యేసు రాకతో (2) స్వరములెత్తి రక్షణ కీర్తన పాడేదము కరములు జోడించి ఉత్సాహ గానము చేసేదమూ (2) దేవదేవుడే, దీనరుపుడై, మనుజవతారుడై పుట్టేనంట (2) ||ఆకాశమంతా||
పాపనికి మన శాపానికి యేసే విడుదలంట (2) నరక అగ్ని నుండి నిత్యజీవనికి యేసే మార్గమంట (2) కోటికాంతుల చిరునవ్వుతో పశువుల సాలలో పుట్టేనంట (2) మార్గము సత్యము జీవముతానై యేసు పుట్టేనంట(మన) (2) ||ఆకాశమంతా||
వేదనలో గొప్ప బాధలలో యేసే విడుదలంట (2) చింతలలో గొప్ప చీకటిలో యేసే వెలుగంట (2) శాంతి సమాధాన దాతయేనని దూత గణములు పాడిరంట (2) మోక్షము క్షేమము రక్షణతానై యేసు పుట్టేనంట (మన) (2) ||ఆకాశమంతా||
కడగండ్లలో కష్ట నష్టములో యేసే విడుదలంట (2) నిందలలో మన నిట్టూర్పులో యేసే తొడంట పాప పరిహార యాగమై ధరణిలో శ్రీ యేసు పుట్టేనంట (2) యజ్ఞము భాగ్యము విజయముతానై యేసు పుట్టేనంట(మన) (2) ||ఆకాశమంతా||