TG-4563
Telugu

ఆకాశం వైపు నా కన్నులెత్తుచున్నాను నా సహాయకుడవు నీవే

Aakaashan Vaipu Naa Kannuleththuchunnaanu Naa Sahaayakudavu Neevee

15
views
పల్లవి

ఆకాశం వైపు నా కన్నులెత్తుచున్నాను నా సహాయకుడవు నీవే యేసయ్యా (2) కలవరము నొందాను నిన్ను నమ్మి యున్నాను (2) కలత నేను చెందను కన్నీళ్లు విడువను (2) ||ఆకాశం||

1వ చరణం

ఆకాశం పై నీ సింహాసనం ఉన్నది రాజ దండముతో నన్నేలుచున్నది (2) నీతిమంతునిగా చేసి నిత్యజీవము అనుగ్రహించితివి (2) నేనేమైయున్నానో అది నీ కృపయే కదా (2) ||ఆకాశం||

2వ చరణం

ఆకాశం నుండి నాతో మాట్లాడుచున్నావు ఆలోచన చేత నన్ను నడిపించుచున్నావు (2) నీ మహిమతో నన్ను నింపి నీ దరికి నన్ను చేర్చితివి (2) నీవు ఉండగా ఈ లోకంలో  ఏదియు నాకు అక్కర లేనే లేదయ్యా (2) ||ఆకాశం||

3వ చరణం

ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి యున్నది అక్షయ జ్వాలగా నాలో రగులుచున్నది (2) నా హృదయము నీ మందిరమై తేజస్సుతో నింపితివి (2) కృపాసనముగా నన్ను మార్చి నాలో నిరంతరం నివసించితివి (2) ||ఆకాశం||

4వ చరణం

ఆకాశము నీ మహిమను వివరించుచున్నది అంతరిక్షము నీ చేతి పనిని ప్రచురించుచున్నది (2) భాష లేని మాటయే నీ స్వరమే వినపడనిది (2) పగలు బోధించుచున్నది రాత్రి జ్ఞానమిచ్చుచున్నది (2) ||ఆకాశం||

5వ చరణం

కొత్త ఆకాశం క్రొత్త భూమి నూతన యెరూషలేము నాకై నిర్మించుచున్నావు (2) మేఘ రథములపై అరుదించి నన్ను కొనిపోవా (2) ఆశతో వేచియుంటిని త్వరగా దిగి రమ్మయ్య (2) ||ఆకాశం||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.