TG-3177
Telugu

ఆలస్యము చేయను నా తండ్రి

aalasyamu cheeyanu naa tandri

Praveen Duttవెంకట్ రెడ్డి ప్ · Venkat Reddy Pనిస్సి జాన్ డ్ర్. అబ్ సుహాస్ మాసిలామని & ప్రవీణ్ దుత్త · Nissi John, Dr. AB Suhas Masilamani & Praveen Dutt
0
views
Chorus

ఆలస్యము చేయను నా తండ్రి - నిన్ను ఆరాధించుటలో ఆశ్రయించితిని నిన్నేకదా - తప్పిదములు తెలుసుకొని

1వ చరణం

తండ్రి ఇంటిని నే విడచి - లోకపు ఆశలను అనుసరించితిని (2) తప్పిపోయిన కుమారుడను, నీరాజ్యమునకు అయోగ్యుడను (2) శరణు జోడితిని దేవా - నా తప్పిదములు తెలుసుకొని (2) ఆలస్యము చేయను తండ్రి - నిన్ను స్తుతించుటలో (2) ||ఆలస్యము||

2వ చరణం

నా వలన పొందిన గాయములను గుర్తించలేని పాపిని (2) నా కొరకు చిందిన రక్తమును వ్యర్థము చేసితిని (2) మారుమనస్సు పొందితిని ప్రభూ - నా తప్పిదములు తెలుసుకొని (2) ఆలస్యము చేయను తండ్రి - నిన్ను మహిమ పరచుటలో (2) ||ఆలస్యము||

3వ చరణం

ప్రచురింతును నిరతము - నీవు సిలువలో చేసిన బలియాగమును (2) వాక్యమునే అనుసరింతును - నీ కృపతో తుది వరకు పోరాడెదను (2) నిన్నే ఆశ్రయించితిని స్వామి - నా తప్పిదములు తెలుసుకొని (2) ఆలస్యము చేయను తండ్రి - నిన్ను ఘనపరచుటలో (2) ||ఆలస్యము||