TG-3031
Telugu

ఆలయంలో ప్రవేశించండి

Aalayamlo Praveshinchandi

14
views
పల్లవి

ఆలయంలో ప్రవేశించండి అందరు స్వాగతం సుస్వాగతం యేసు నామంలో మీ బ్రతుకులో పాపమా కలతలా మీ హృదయంలో బాధలా కన్నీరా మీ కన్నీరంతా తుడిచి వేయు రాజు యేసు కోసం ||ఆలయంలో||

1వ చరణం

దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై వెదికే వారికంతా కనబడు దీపము యేసు రాజు మాటలే వినుట ధన్యము వినుట వలన విశ్వాసం అధికమధికమై ఆత్మలో దాహము తీరెను రారండి ఆనందమానందం హల్లెలూయా ||ఆలయంలో||

2వ చరణం

ప్రభు యేసు మాటలే పెదవిలో మాటలై జీవ వృక్షంబుగా ఫలియించాలని పెదవితో పలికెదం మంచి మాటలే హృదయమంతా యేసు ప్రభుని ప్రేమ మాటలై నింపెదం నిండెదం కోరెదం పొందెదం ఆనందమానందం హల్లెలూయా ||ఆలయంలో||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.