TG-1019
Telugu

ఆలయంలో ప్రవేశించండి అందరూ

aalayanloo praveeshinchandi andaruu

200
views
పల్లవి

ఆలయంలో ప్రవేశించండి అందరూ స్వాగతం సుస్వాగతం యేసునామంలో మీ బ్రతుకులో పాపమా కలతలా మీ హృదయంలో బాధలా కన్నీరా మీ కన్నీరంతా తిడిచి వేయు రాజు యేసు కోసం

1వ చరణం

ఇబ్బంది కొలిమిలో నన్ను కాల్చి నావు - పరిశుద్ధాత్మతో నన్ను నింపినావు (2) నిన్ను వెంబడించెదా వెన్నంటి నిడిచెదా- నీ పనిలో మెండుగా ఫలియింప చేసినావు (2) ||ఆలయంలో ప్రవేశించండి||

2వ చరణం

నీ తోటలో పనివానిగా ఎంచినావు నన్ను - నీ సేవలో జీవింపచేసినావు నన్నూ (2) బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమే - పరమ కానానులో నన్ను చేర్చు నీ ధరికి (2) ||ఆలయంలో ప్రవేశించండి||

3వ చరణం

కంటికి కనబడవు నీ అద్భుత కార్యములు - చెవికి వినబడవు ఆశ్చర్యక్రియలు (2) నన్ను వెంభడించితివి ప్రతి స్థలముయందునా - శాశ్వత ప్రేమతో నన్ను దీవించితివి (2) ||ఆలయంలో ప్రవేశించండి||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.