ఆలించు మా ప్రార్థన మా

aalinchu maa praarthana maa

🎵 TG-587💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

ఆలించు మా ప్రార్థన మా రక్షకా యాలించు మా ప్రార్థన నాలింతు వని నమ్మి యాసక్తి వేఁడెదము మేలైన దీవెనలు మెండుగాఁ గురిపించి ||ఆలించు మా||

1వ చరణం

ఈ సదన మర్పింతుము మా ప్రియ జనక నీ సుతుని దివ్యాఖ్యను నీ సేవకై మేము నెనరుచే నొసఁగు ని వాసము గైకొని వర కరుణచే నిప్పు ||ఆలించు మా||

2వ చరణం

ఇందుఁ గూడెడు భక్తుల డెందము లనెడు మందిరంబుల నాత్మచే పొందుగ నివసించి పూర్ణుఁడ వగు దేవ యంద మైన సుగుణ బృందంబుతో నింపి ||ఆలించు మా||

3వ చరణం

ఇచ్చట శుభవార్తను విచ్చల విడిగ వచ్చి వినెడు పాపులఁ జెచ్చెర రక్షించి యిచ్చి శుద్ధాత్మను సచ్చరిత్రులఁ జేసి సాంద్ర మగు కరుణచే ||ఆలించు మా||

4వ చరణం

నభము నేలెడి తండ్రి యిచ్చోటను శుభవార్త బోధించెడు ప్రభు యేసు సేవకులు సభకు మాదిరు లగుచు సభ వృద్ధి నొందింప శక్తి వారల కిచ్చి ||ఆలించు మా||

5వ చరణం

చుట్టు నుండెడు నూళ్లలో శుభ వాక్యంబు దిట్టముగఁ బ్రకటింపఁ గఁ పట్టు గల్గెడివారి బంపి యిచ్చటనుండి దట్టమగు నీ ప్రేమఁ దగినట్లు తెలిపించి ||ఆలించు మా||

Report Error